
Hyderabad, FEB 20: తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ (IAS Transfers) చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార కమిషనర్, మార్కెటింగ్ డైరెక్టర్‌గా కె.సురేంద్రమోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యశ్రీ సీఈవో ఎల్.శివకుమార్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు వీళ్లే
ఆరోగ్యశ్రీ సీఈవోగా ఆర్.వి.కర్ణన్‌కు అదనపు బాధ్యతలు
వాణిజ్య పన్నుల డైరెక్టర్‌గా కె.హరిత నియామకం
విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు
తెలంగాణ ఫుడ్స్ ఎండీగా కె.చంద్రశేఖర్‌రెడ్డికి అదనపు బాధ్యతలు
వనపర్తి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ నారాయణపేట అదనపు కలెక్టర్‌గా బదిలీ
టెక్స్‌టైల్స్, హ్యాండ్లూమ్స్ డైరెక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి మాతృ సంస్థకు బదిలీ